బీజేపీకి భారీ షాక్..మాజీ ఎంపీ వివేక్ గుడ్ బై
1 min read
మాజీ ఎంపీ గడ్దం వివేక్ మరో సారి పార్టీ మార్చారు. ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పారు. వివేక్ కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి వివేక్ పంపించారు. దీంతో ఎన్నికల ముందు బీజేపీకి భారీ షాక్ తగిలినట్లైంది. వివేక్ కుమారుడు వంశీ చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
వివేక్ కాంగ్రెస్ తో రాజకీయాలు ప్రారంభించారు. పెద్దపల్లి నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అక్కడ సరైన గుర్తింపు లేదన్న భావనతో మళ్లీ కాంగ్రెస్ గూటికి వచ్చారు. అక్కడి నుంచి బీజేపీలోకి వెళ్లారు. తాజాగా మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.