కేరళ సీఎం అభ్యర్థి ఫైనల్

కాంగ్రెస్ అధిష్టానం కేరళ సీఎం అభ్యర్థి ఫైనల్ చేసింది. సతీషన్ కేరళ ముఖ్యమంత్రి కాబోతున్నారు. వారం రోజుల తర్జనభర్జన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్రంగా పోటీపడినప్పటికీ చివరకు సతీషన్ వైపు పార్టీ అధిష్టానం మొగ్గింది. ప్రతిపక్ష నాయకుడిగా సీపీఎం ప్రభుత్వం పైన సతీషన్ గట్టిపోరాటం చేశారు. దీంతో ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సతీషన్ ను ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెడుతోంది.
సతీషన్ ఎర్నాకులం జిల్లాలోని పరవూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) 102 స్థానాల భారీ విజయంతో అధికారంలోకి వచ్చింది.
