విజయ్ బలనిరూపణ.. అన్నాడీఎంకే లో భారీ చీలిక

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్ర అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. ఆయనకు మిత్రపక్షాలతో పాటు అన్నాడీఎంకే సభ్యులు కూడా కొందరు మద్దతు పలకడంతో సులభంగా ఆయన బల నిరూపణ పూర్తి చేసుకున్నారు. మొత్తం 144 మంది ఎమ్మెల్యేలు విజయ్ ను బలపర్చారు. 22 మంది వ్యతిరేకించారు. అన్నాడీఎంకే లోభారీ చీలిక వచ్చింది. డీఎంకే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. విజయ్ కు కాంగ్రెస్ , సీపీఐ, సీపీఎం తో పాటు ఒకటి రెండు చిన్న పార్టీలు మద్దతు ఇచ్చాయి.
