రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర ఎస్ఐ..

మేడ్చల్ జిల్లా: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలకు కీసర పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ కొండారెడ్డి శ్రీనివాస్ చిక్కినట్లు సమాచారం. రూ.2 లక్షల లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నట్లు తెలిసింది.భూ మోసం, 498A కేసులకు సంబంధించి కోర్టులో చార్జ్షీట్లు త్వరగా దాఖలు చేయడంతో పాటు, అనుకూలంగా వ్యవహరించేందుకు ఎస్ఐ లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఫిర్యాదు ఆధారంగా నవంబర్ 9న ఏసీబీ అధికారులు కీసర–నాగారం పరిధిలోని శిల్పా లేఅవుట్ (శిల్పానగర్ కాలనీ) వద్ద వలపన్నారు. ఈ క్రమంలో రూ.2 లక్షలు తీసుకుంటున్న సమయంలో ఎస్ఐను పట్టుకున్నట్లు సమాచారం.లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు ఎస్ఐపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారుల అధికారిక ప్రకటన, తదుపరి దర్యాప్తు వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
#ACBTelangana #KeesaraSI #MedchalNews #ACBRaid #TelanganaPolice #BriberyCase
