కిషన్ రెడ్డి తెలంగాణ రైతు ద్రోహి

ధాన్యం కొనుగోళ్ల పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ధ్వజమెత్తారు. ఆయన సోయి లేకుండా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డిని చూసి అసహ్యించుకుంటున్నారన్నారు. బీజేపీ నాయకులు రాజకీయ యాత్ర చేశారని, వాళ్లకు రైతుల ప్రయోజనాలు పట్టవని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల బాధ్యత తమది కాదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో వేముల వీరేశం స్పందించారు. పంజాబ్,హర్యానా ల్లో పండిన పంట మొత్తం కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణ లో మాత్రం 30 శాతం మాత్రమే ఎందుకు కొంటుందని ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్న బీజేపీ మంత్రులను ద్రోహులుగా పరిగణిస్తారన్నారు.
