కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖ ను గవర్నర్ కార్యాలయంలో అందజేశారు. రాజీనామాకు ముందు తన నివాసంలో మంత్రి వర్గ సహచరులు, పార్టీ సీనియర్ నాయకులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటిస్తు ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేసినట్లు సిద్దరామయ్య మీడియాలో సమావేశంలో తెలిపారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గా అవకాశం కల్పించినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అంతకు ముందు డీకె శివకుమార్ సిద్దరామయ్య ఆశీస్సులు తీసుకున్నారు. సిద్దరామయ్య పాదాలకు డీకె శివకుమార్ దండం పెట్టారు. సిద్దరామయ్య రాజీనామా ఆమోదం పొందిన వెంటనే డీకె శివకుమార్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తారు.
