కాంగ్రెస్ విద్యాశాఖ మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో ఏఐసీసీ కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో విద్యా విధానం అమలు, అక్షరాస్యత పెంపు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు డీకే శివ కుమార్, వీడీ సతీషన్, సుఖ్వీందర్ సింగ్ సుఖు తదితరులు పాల్గొన్నారు
#CMRevanthReddy #RevanthReddy #Congress #EducationMinisters #EducationMeeting #TelanganaEducation #TelanganaPolitics #TelanganaNews #CongressMeeting #EducationReforms #TelanganaGovernment #VSRBreakingNews
