బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గుడ్ బై
1 min readఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. నకిరేకల్ లో అనుచరులతో సమావేశం నిర్వహించిన ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. మరో వారం రోజుల్లో ఏ పార్టీలో చేరే విషయాన్ని ప్రకటిస్తానని వీరేశం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ జిల్లా నాయకత్వం తనను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యే తన అనుచరులను వేధిస్తున్నా పట్టించుకోలేదని ఆయన అన్నారు. మరో వైపు ఆయన అనుచరులు కాంగ్రెస్ లో చేరాల్సిందిగా వేముల వీరేశానికి సూచించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరనున్నారు.