బండి సంజయ్ కొడుకు పైన ఫోక్సో కేసు ఎందుకు పెట్టలేదు..?

బండి సంజయ్ ను కేంద్ర మంత్రి వర్గం నుంచి ఎప్పుడు బర్తరఫ్ చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, మీ ‘బేటీ బచావో’ కేవలం ఒక నినాదమేనా అని ఆన ప్రశ్నించారు. బండి సంజయ్ కుమారుడిపైన కేసు నమోదు అయిన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు.బాలిక తో పాటు ఆమె కుటుంబం పైన వేధింపులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఒక మైనర్ బాలిక అన్ని ఆధారాలతో వచ్చినప్పుడు పోలీస్ శాఖ అత్యంత వేగంగా ఎందుకు స్పందించలేదని కేటీఆర్ ప్రశ్నించారు.కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఇతర POCSO నేరస్తుల మాదిరిగానే కేసు నమోదు చేసి ఎందుకు విచారణ జరపడం లేదని కేటీఆర్ అన్నారు.మైనర్ బాలికపైనే ఎదురు కేసు ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు ఒక మైనర్ బాలికపై హనీ-ట్రాప్ మరియు వసూళ్ల కేసు నమోదు చేశారన్నారు.
