కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి
1 min readతెలంగాణ మంచి రోజులు రాబోతున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎలక్షన్ షెడ్యూల్ ను ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. తెలంగాణకు కేసీఆర్ కు విముక్తి కలిగించే తేదీలను ఈసీ ప్రకటించిందని రేవంత్ రెడ్డి అన్నారు. నవంబర్ 30న తెలంగాణకు పట్టిన పీడ విరగడ కాబోతుందని ఆయన స్పష్టం చేశారు. విజయదశమి నుంచి కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలోకి వెళ్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆరుగ్యారంటీలతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయని ఆయన అన్నారు.ఆరు గ్యారెంటీ స్కీమ్ లే కాంగ్రెస్ అభ్యర్థులని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ను కేసీఆర్ దోచుకున్నారని, అన్నింటా అవినీతికి పాల్పడ్డారని పీసీసీ చీఫ్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ను రక్షించడానికి బీజేపీ, ఎంఐఎం ప్రయత్నాలు మొదలు పెట్టాయని ఆయన ఆరోపించారు. బీజేపీకి ఎక్కడ డిపాజిట్లు రావని తెలిసినా మోదీ ఎందుకు తెలంగాణ కు వస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.