లొంగిపోయిన మావోయిస్టు సీనియర్ నేత నరహరి

సీనియర్ మావోయిస్టు నేత పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ అలియాస్ సలై దా తెలంగాణ పోలీసుల ముదు లొంగిపోయాడు. ఆయన సతీమణి మేదర దానమ్మ అలియాస్ లత అలియాస్ జోబా కూడా ఆయనతో పాటు సరెండర్ అయ్యారు. తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ సమక్షంలో వీరిద్దరు లొంగిపోయారు. అడవుల్లో ఇంకా మిగిలి ఉన్న మావోయిస్టు సభ్యులు కూడా లొంగిపోయి తమ కుటుంబాలతో ప్రశాంత జీవితం గడపాలని డీజీపీ ఈ సందర్భంగా కోరారు.
