కడియంతో చేతులు కలిసిన ఎమ్మెల్యే రాజయ్య
1 min readస్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య బీఆర్ఎస్ తో రాజీ పడ్డారు. టికెట్ ఇవ్వకపోయినా పార్టీకి సహకరించాలని ఆయన నిర్ణయించుకున్నారు. పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి విజయం కోసం పనిచేస్తానని రాజయ్య స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో రాజయ్య, కడియం శ్రీహరి మధ్య రాజీ కుదిరింది. ప్రగతిభవన్ లో జరిగిన ఈ సమావేశంలో రాజయ్యకు నచ్చిచెప్పి పార్టీ కోసం పని చేయాలని కేటీఆర్ సూచించారు. త్వరలోనే సముచిత స్థానం కల్పిస్తామని ఆయనకు భరోసా ఇచ్చారు. దీంతో కడియం శ్రీహరికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు రాజయ్య చెప్పారు.