కాంగ్రెస్ లో చేరిన జిట్టా బాలక్రిష్ణారెడ్డి

1 min read

బీజేపీ మాజీ నేత జిట్టా బాలక్రిష్ణారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవలె బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఆయన కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. జిట్టా బాలక్రిష్ణారెడ్డికి భువనగిరి నియోజకవర్గంలో మంచి పట్టుంది. తెలంగాణ ఉద్యమకారుడైన ఆయన ఇంతకు ముందు సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అయితే కేసీఆర్ పైన బీజేపీ వైఖరీ పట్ల నిరసన వ్యక్తం చేయడంతో ఆయనను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.  ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేశారు. భువనగిరి ఎమ్మెల్యే సీటును జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn