టీ కాంగ్రెస్ పరిశీలకుడిగా దిగ్విజయ్ సింగ్
1 min readతెలంగాణ కాంగ్రెస్ లో ఏర్పడిన విభేదాల పరిష్కారం కోసం అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య నెలకొన్న వివాదంపైన పార్టీ నాయకత్వం ద్రుష్టి సారించింది. కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను పరిశీలకుడిగా నియమించింది. అసలైన కాంగ్రెస్ నాయకులకు పీసీసీ కమిటీలో అవకాశం దక్కలేదంటు పలువురు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిపైన బహిరంగ విమర్శలు చేశారు. దీంతో రేవంత్ రెడ్డి వర్గం పీసీసీ కమిటీలకు రాజీనామా చేసింది. ఫలితంగా వివాదం మరింత ముదిరింది. ఈ గందరగోళం కొనసాగుతుండగానే రేవంత్ రెడ్డి పాదయాత్ర ను ప్రకటించారు. ఈ పరిణామాలతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొన్నది. దీంతో అధిష్టానం కలగజేసుకొని దిగ్విజయ్ సింగ్ ని పరిశీలకుడిగా పంపుతోంది.
https://youtube.com/live/iR-vuMw4Q2w?feature=share