ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సందర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలు పాడిపంటలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండేలా చూడాలని అమ్మవారిని ప్రార్థించానని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
