కుటుంబ సమేతంగా గణపతి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సమేతంగా గణపతి పూజ నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నీ తొలగిపోవాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతి కుటుంబానికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు కలగాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
