మహిళా రిజర్వేషన్ బిల్లుకు మరో సారి బ్రేక్

చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందలేదు . ప్రతిపక్షాల మద్దతు కూడగట్టడంతో అధికార ఎన్టీఎ సర్కార్ విఫలమైంది. 131 వ రాజ్యాంగ సవరణ పైన జరిగిన ఓటింగ్ లో 2/3 సభ్యుల మెజారిటీ తెచ్చుకోకపోవడంతో బిల్లు వీగిపోయింది. దీంతో మిగిలిన రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
బిల్లుకు అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. మొత్తం 528 మంది ఎంపీలు ఓటింగ్ లో పాల్గొన్నారు. బిల్లు ఆమోదం పొందాలంటే 352 ఓట్లు రావాల్సి ఉంటుంది. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డిలిమిటేషన్ బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది.
