వాయిస్ ఆఫ్ ది కాంగ్రెస్..సీఎం రేవంత్ రెడ్డి

              మ‌హిళా రిజ‌ర్వేష‌న్ తో పాటు డిలిమిటేషన్ బిల్లు తీసుకురావ‌డం పైన తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గ‌ట్టి పోరాటం చేశారు. గ‌త కొన్ని రోజులుగా ఈ అంశంపైన ఆయ‌న పెద్ద ఎత్తున చ‌ర్చ‌లేవ‌నెత్తారు. డిలిమిటేషన్ వ‌ల్ల ద‌క్ష‌ణాది రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల‌కు క‌లిగే న‌ష్టంపైన ఆయ‌న గ‌ళ‌మెత్తారు. ప్ర‌ధాని మోదీతో పాటు ద‌క్ష‌ణాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ప్ర‌త్యేకంగా లేఖ‌లు రాశారు. డిలిమిటేషన్ వ‌ల్ల‌  జ‌రిగే న‌ష్టాన్ని గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించారు. ఫ‌లితంగా కాంగ్రెస్ బ‌లంగా త‌న వైపు వాద‌న‌ల‌ను వినిపించ‌గ‌ల్గింది. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుతో పాటు డిలిమిటేషన్ బిల్లు తీసుకువ‌చ్చి రాజ‌కీయంగా దెబ్బ‌తీయాల‌న్న బీజేపీ వ్యూహాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ‌య‌వంతంగా చేధించార‌నే చ‌ర్చ జ‌రుగుతుంది.

మ‌రో వైపు లోక్ స భ‌లో 131 రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు వీగిపోవ‌డం పైన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇది చిర‌స్థాయిగా నిలిచిపోయే మ‌రుపురాని రోజుని ఆయ‌న వ్యాఖ్యానించారు.
లోక్‌సభ విప‌క్ష నేత రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ప్రజాస్వామ్య శక్తులు, ప్రతిపక్ష నాయకులు అంతా ఏకమై ఒక జాతీయ విపత్తును నివారించిన సంద‌ర్భమ‌ని ఆయ‌న ఆయ‌న స్ప‌ష్టం చేశారు. లోక్‌స‌భ‌లో 131వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు వీగిపోయిన సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ట్విట్ చేశారు. నల్ల బిల్లుల‌ను ఓడించేందుకు కఠిన పరిస్థితుల్లోనూ ఐక‌మ‌త్యంతో, సాహాసంతో నిలిచిన మిత్రపక్షాల నాయకులు ఎం.కే. స్టాలిన్ , మమతా బెనర్జీ , అఖిలేష్‌ యాదవ్ , శరద్ పవార్ , ఉద్ధ‌వ్ ఠాక్రే , లాలు ప్రసాద్ యాదవ్ , హేమంత్ సోరెన్ , ఫరూఖ్ అబ్దుల్లా , నవీన్ పట్నాయక్ , అరవింద్ కేజ్రీవాల్ , అలాగే కమ్యూనిస్ట్ పార్టీల నాయకులంద‌రికీ ఆయ‌న‌ హృద‌య పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn