హైదరాబాద్ లో కూర్చుంటే ఓప్పుకోను.. సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

ఎస్ ఐఆర్ ప్రక్రియను పార్టీ నాయకులు సీరియస్ గా తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహారిస్తు హైదరాబాద్ చుట్టు తరిగితే సహించబోమన్నారు. సర్ పైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లు, నియోజక వర్గ ఇంచార్జ్ లు, sir కో ఆర్డినెటర్స్ జూమ్ లో పాల్గొన్నారు.
పెరిగిన ఎస్ ఐఆర్ గడువు ఒక అవకాశంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్ పైన 489 సమావేశాలు జరిగాయన్న ఆయన కొన్ని నియోజకవర్గాల్లో బాగా వెనుకబడి ఉన్నారన్నారు. బాగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
చైర్మన్లు పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీభవన్ చుట్టు తిరగుతున్న వాళ్లకు అపాయింట్మెంట్లు ఇవ్వొద్దని ఆయన పీసీసీ అధ్యక్షుడికి సూచించారు. 3 వ తేదీ వరకు గాంధీ భవన్ కు రావొద్దని ఆయన నాయకులకు స్పష్టం చేశారు.కొందరు నాయకులు హైదరాబాద్ లో కూర్చుని పనిచేయడం లేదన్నారు.ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.వచ్చే పది రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.30 వ తేదీన మళ్లీ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకోని ఇంఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జ్ లను సమన్వయం చేయాలని సూచించారు.బాగా పనిచేసే 100 మంది బీఎల్ ఏ లకు రాహుల్ గాంధీ ని కలిసి ఫోటో దిగే అవకాశం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
