బీజేపీకి విక్రమ్ గౌడ్ గుడ్ బై
1 min readఅసెంబ్లీ ఎన్నికల్లో పరాభవంతో ఇప్పటికే నిరాశలో ఉన్న బీజేపీ కి ఆ పార్టీ నాయకులు షాక్ ఇస్తున్నారు. లోక్ సభ ఎలక్షన్స్ లో సత్తా చాటాలని భావిస్తున్న కాషాయ పార్టీకి నేతలు గుడ్ బై చెబుతున్నారు. హైదరాబాద్ లో బీజేపీ కీలక నేత విక్రమ్ గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి పంపించారు. గోషామహల్ టికెట్ ఆశించి భంగపడిన విక్రమ్ గౌడ్ గత కొన్నాళ్ల నుంచి అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్. ముఖేష్ గౌడ్ చనిపోయిన తర్వాత విక్రమ్ బీజేపీలో చేరారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నారు.