బెంగళూరుకు తెలంగాణ మంత్రులు

జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని కోరేందుకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల బృందం బెంగళూరుకు బయలుదేరింది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యేందుకు రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తూడి మేఘారెడ్డి బెంగళూరుకు వెళ్లారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలను కర్ణాటక సీఎంతో జరిగే సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేల బృందం వివరించనుంది. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాలమూరు రైతుల పంటలకు సాగునీరు అందించడంతో పాటు ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చేందుకు నీటిని విడుదల చేయాలని కోరనున్నారు.
జూరాల ప్రాజెక్టుకు దశలవారీగా నీటిని విడుదల చేయాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను మంత్రుల బృందం కోరనుంది. పాలమూరు ప్రాంత రైతుల పంటలను కాపాడటంతో పాటు తాగునీటి అవసరాలను తీర్చేందుకు నీటి విడుదల అత్యవసరమని తెలంగాణ ప్రతినిధులు వివరించనున్నారు.
#JuralaProject #JuralaWater #DKShivakumar #KarnatakaCM #Palamuru #Mahabubnagar #TelanganaFarmers #TelanganaNews #Irrigation #WaterRelease #TelanganaGovernment #RevanthReddy #VSRBreakingNews
