కొత్త మంత్రులకు శాఖలు ఇవే..
1 min read
ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ సీఎం ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలను అడ్లూరి లక్ష్మణ్ కు ,గనులు,కార్మిక శాఖ గడ్డం వివేక్ కు కేటాయించారు. క్రీడలు, యువజన సర్వీసులు, పశు సంవర్థక శాఖలను వాకిటి శ్రీహరి కి ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయించారు. పాత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పు చేయలేదు.