సీపీఆర్వో మధు కుటుంబాన్ని ఆదుకుంటా

ఇటీవల గుండెపోటుతో మరణించిన తన సీపీఆర్వో మారబోయిన మధు కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని మధు స్వగృహానికి వెళ్లిన భట్టి ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. సీపీఆర్వో గా బాధ్యతలు నిర్వహిస్తు గుండెపోటుతో మధు చనిపోయారు.
