మావోయిస్టు గ‌ణ‌ప‌తి లొంగిపో.. సీఎం రేవంత్ రెడ్డి

మనందరం కలిస్తేనే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.భారత్ ఫ్యూచర్ సిటీని అద్భుతమైన నగరంగా అభివృద్ధి చేసుకుందామ‌ని ఆయ‌న పిలుపునిచ‌చారు. సింగపూర్, టోక్యో, న్యూయార్క్ లా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింద‌ని స్ప‌ష్టం చేశారు. “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు.ఆనాడు ఔటర్ రింగురోడ్డు నిర్మించేటప్పుడు ఇది అయ్యేది కాదని చాలామంది అనుకున్నారని సీఎం అన్నారు. 160 కి.మీ ఔటర్ రింగు రోడ్డు దేశంలో ఏ నగరానికి లేదని,
ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న రైతులనుప్రభుత్వం ఆదుకుంటుంద‌ని హామీ ఇచ్చారు.

 

మేం అభివృద్ధి చేస్తామంటే కొందరు ఏడుపులు మొదలు పెట్టారని ముఖ్య‌మంత్రి ధ్వ‌జ‌మెత్తారు. మీరు ఏడుస్తూనే ఉండండి.. మేం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళతామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దేవతలు యజ్ఞాలు చేస్తుంటే శుక్రాచార్యుడు మారీచుడు, సుబాహుడును పంపి భగ్నం చేయాలని ప్రయత్నించే వారని ముఖ్య‌మంత్రి అన్నారు.
రాష్ట్రంలో కూడా ఫామ్ హౌస్ లో ఉన్న శుక్రాచార్యుడు మన అభివృద్ధి యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు మారీచుడు, సునాహుడిని పంపాడని సీఎం వ్యాఖ్యానించారు.

ఇంకా ఎవరైనా మావోయిస్టులు అడవుల్లో మిగిలిపోతే వచ్చి జనజీవన స్రవంతిలో కలవాల‌ని ముఖ్య‌మంత్రి పిలుపునిచ్చారు. మావోయిస్ట్ నేత గ‌ణేష్ ఆరోగ్య ప‌రిస్థితి బాగాలేద‌ని, ఆయ‌న లొంగిపోతే వైద్యం అందిస్తామ‌ని సీఎం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn