సింగర్ సునీతను పెళ్లి కూతురిని చేసిన కొడుకు,కూతురు
1 min readప్రముఖ గాయని సునీత పెళ్లి కూతురైంది. కూతురు, కొడుకు సమక్షంలో ఆమెను కుటుంబ సభ్యులు పెళ్లి కూతురిని చేశారు. వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని ఆమె పెళ్లి చేసుకుంటున్నారు. గాయని సునీతకు ఇది రెండో వివాహం. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత ఇద్దరు పిల్లల తర్వాత విడాకులు తీసుకున్నారు. చాలా కాలం ఒంటరిగా గడిపిన ఆమె రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ ను ఆమె వివాహం చేసుకుంటున్నారు.