తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు

హైదరాబాద్, అక్టోబర్ 28: తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, మరికొందరికి పూర్తి అదనపు బాధ్యతలు (FAC) అప్పగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ G.O.Rt.No.1553 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా, ఇంధనం, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, ఆరోగ్య, సంక్షేమ శాఖల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
వికాస్ రాజ్: రవాణా, రోడ్లు, భవనాల శాఖ నుంచి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం.
- నవీన్ మిట్టల్: ఇంధన శాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ.
- వాణి ప్రసాద్: క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు.
- శైలజా రామయ్యర్: రెవెన్యూ శాఖలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియామకం.
- రాహుల్ బొజ్జా: గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు.
- ఇళంబరితి కె.: రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా నియామకం. రవాణా కమిషనర్‌గా అదనపు బాధ్యతలు.
- సర్ఫరాజ్ అహ్మద్: HMDA పరిధిలోని పట్టణాభివృద్ధి శాఖతో పాటు GHMC, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు.
- ముషర్రఫ్ అలీ ఫారూఖీ: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియామకం.
- సంగీత సత్యనారాయణ: మహిళా, శిశు సంక్షేమం మరియు ప్రత్యేక వర్గాల శాఖ డైరెక్టర్‌గా నియామకం.
- జితేష్ వి. పాటిల్: TGREDCO వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, క్రీడలు, హెరిటేజ్ తెలంగాణ, పట్టణాభివృద్ధి సంబంధిత కొన్ని అదనపు బాధ్యతల నుంచి జయేశ్ రంజన్‌ను తప్పించి ఇతర అధికారులకు అప్పగించారు.
#Telangana #TelanganaNews #IASTransfers #IASOfficers #TelanganaGovernment #IASPostings #VikasRaj #NavinMittal #VaniPrasad #RahulBojja #JayeshRanjan #HyderabadNews #BreakingNews #TelanganaBreakingNews #GovernmentOrders
