ఒకే ఫ్రేంలో చంద్రబాబు,పవన్, బాలయ్య, లోకేష్
1 min read
తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా’ పేరుతో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విజయవాడలో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , నందమూరి బాలక్రిష్ణ, నారా లోకేష్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ను ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సాదరంగా స్వాగతించారు.వీరంతా ఒకే చోట సందడి చేయడంలో అభిమానులకు కన్నులవిందుగా కనిపించింది.