ఈటెల సెక్యూరిటీపైన కేటీఆర్ ఫోకస్
1 min read
తనను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటు ఈటెల రాజేందర్ చేసిన ఆరోపణలపైన మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈటెల భద్రతపైన సమీక్ష జరపాలని ఆయన డీజీపీకి సూచించారు. కేటీఆర్ ఆదేశాలతో సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ కి ఈ అంశాన్ని అప్పగించారు. ఈటెల రాజేందర్ సెక్యూరిటీతో పాటు నియోజకవర్గ పరిస్థితులను పరిశీలించి భద్రతపైన నివేదికను ఇస్తారు. మరో వైపు ఈటెలకు వై కేటగిరి భద్రతను ఇవ్వడానికి కేంద్రం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసినప్పుడు ఈటెల తన భద్రత అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డి సుఫారీ ఇచ్చి ఈటెలను చంపించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈటెల రాజేందర్ సతీమణి జమున తాజాగా ఆరోపించారు. 20 కోట్ల సుఫారీ ఇచ్చి చంపిస్తానంటు కౌషిక్ రెడ్డి మాట్లాడినట్లుగా ఆడియో బయటకు వచ్చినట్లు ఆమె చెపుతున్నారు. ఈటెలకు ఏమైనా కేసీఆర్ అందుకు బాధ్యత వహించాలని జమున డిమాండ్ చేశారు. పాడి కౌషిక్ రెడ్డి పిచ్చికుక్కలా వ్యవహారిస్తున్నారని ఆమె విమర్శించారు. ఆయన వెనుక కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని జమున ఆరోపించారు.