టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ ..?

1 min read

బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ ఎపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన రాజకీయ భవిష్యత్తుపైన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. గత కొంత కాలంగా బీజేపీ నాయకత్వంపైన అసంత్రుప్తిగా ఉన్న ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. ముఖ్యనాయకులు, అనుచరులతో గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ సమావేశమయ్యారు. తన వర్గానికి చెందిన 8 మంది జిల్లా బీజేపీ అధ్యక్షులను సోము వీర్రాజు తొలగించడంపైన కన్నా ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ అధిష్టానం దూతలు వచ్చి ఆయనతో మాట్లాడినప్పటికి కన్నా అలక వీడలేదు. బీజేపీని వదలాలని నిర్ణయించుకున్న ఆయన ఏ పార్టీలో చేరాలన్న దానిపైన అనుచరులతో చర్చించనున్నారు. కన్నా లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎపిలో జనసేన, బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న నేపథ్యంలో కన్నా అంశం ఈ రెండు పార్టీలకు కీలకం కాబోతుంది.ఇదే సమయంలో కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn