రేవంత్ రెడ్డికి అభిమాని కొర్రమీను కూర
1 min read
పాదయాత్ర చేస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయనను కలవడం కోసం పోటీ పడుతున్నారు. పాదయాత్ర పొడువునా ఆయనతో కరచాలనం చేయడానికి ,సెల్ఫీ తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డిని తమ ఇళ్లకు ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వడానికి పోటీపడుతున్నారు. తాజాగా పాలకుర్తి పాదయాత్రలో రేవంత్ రెడ్డి ఓ అభిమాని ఇంటి సందర్శించి టీ తాగారు. తన అభిమాన నాయకుడు ఇంటి రావడంతో పొంగిపోయిన ఆయన రేవంత్ రెడ్డికి కొర్రమీను కూర చేసి వడ్డించాలని భావించింది. స్వయంగా చెరువు నుంచి కొర్రమీను చేపలను తీసుకువచ్చి వండి ఆ కూరను రేవంత్ రెడ్డికి అందజేసి సంతోషపడ్డాడు.