బండి భగీరథ్ ను నడిరోడ్డు పైన అరెస్టు చేశాం

బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను పోలీసులు అరెస్టు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సారి స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ లేదా కోర్టులో లొంగిపోతారని, నడిరోడ్డు మీద కాదని ఆయన తేల్చి చెప్పారు. బండి భగీరథ్ పైన పోలీసుల సమాచారాన్ని మాత్రమే తాను నమ్ముతానని, రాజకీయ నాయకులను కాదని ముఖ్యమంత్రి అన్నారు. ఈ విషయంలో బీఆరెస్ నేతలు మానవత్వం మరిచిపోయి వ్యవహరిస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. POCSO కేసులో ఏదో సాధించినట్లు బీఆరెస్ నేతలు శాడిస్టులా ప్రవర్తిస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు. రాజకీయాలు చేయాలనుకుంటే ఎన్నికల్లో ఓడించాలి కాని దిగజారి ప్రవర్తించొద్దని ముఖ్యమంత్రి అన్నారు. కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికినా నోటీసు ఇచ్చి విచారించామన్న ఆయన బండి భగీరథ్ విషయంలోనూ అదే విధంగా వ్యవహరించామన్నారు.
కేటీఆర్ ఇంకా కల్వకుంట రాజ్యాంగంలోనే ఉన్నానని అనుకుంటున్నారని,కేసీఆర్ దిగిపోయి చాలా రోజులైందన్నారు.పార్టీ మీటింగ్ కోసం జగిత్యాలకు వెళ్లిన కేసీఆర్, రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ఎందుకు బయటకు రాలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
