కొత్తకోట దయాకర్ రెడ్డికి చంద్రబాబు నివాళి
1 min read
అనారోగ్యంతో చనిపోయిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాళ్లర్పించారు. కొత్తకోట స్వగ్రామానికి వెళ్లిన ఆయన స్వయంగా పాడేమోశారు. దయాకర్ రెడ్డి కుటుంబసభ్యులకు చంద్రబాబునాయుడు ధైర్యం చెప్పారు. కొత్తకోట దయాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరుపున మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్, చంద్రబాబు అంటే ఆయనకు విపరీతమైన అభిమానం. తెలంగాణలో తెలుగుదేశం నుంచి అనేక మంది నాయకులు వెళ్లిపోయినా దయాకర్ రెడ్డి మాత్రం ఇటీవల వరకు ఆ పార్టీలో కొనసాగారు. దయాకర్ రెడ్డి సతీమణి సీతాదయాకర్ రెడ్డి కూడా శాసనసభ్యురాలిగా,జడ్పీ ఛైర్మన్ గా పనిచేశారు.