కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
1 min read
పెద్దపల్లిలో అధికార బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. పెద్దపల్లి మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ బిరుదు సమతతో పాటు అనేక మంది సర్పంచ్ లు, ఎంపిటిసిలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఇంఛార్జ్ విజయరమణారావు ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి.