వి6, వెలుగు దినపత్రికపైన బీఆర్ఎస్ బహిష్కరణ
1 min read
వీ6,వెలుగు దినపత్రికలను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ఇక ముందు తమ పార్టీ కార్యక్రమాలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఆ మీడియా సంస్థలు నిర్వహించే చర్చల్లో పార్టీ నాయకులు పాల్గొన వద్దని ఆదేశించింది. బీజేపీకి కొమ్ముకాస్తు బీఆర్ఎస్ పైన విషం చిమ్ముతున్నందు వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ స్పష్టం చేసింది. బీజేపీ జేబు సంస్థగా మారి అబద్దాలు, అస్యతాలను ప్రచారం చేస్తోందని బీఆర్ ఎస్ ఒక ప్రకటనలో పేర్కొన్నది. వీ6,వెలుగు దినపత్రికలపైన బ్యాన్ విధిస్తామని ఇటీవలె బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ కార్యాలయానికి రాకుండా నమస్తే తెలంగాణను నిషేదించారని, తామెందుకు వీ6ను బైకాట్ చేయకూడదని ఆయన ప్రశ్నించారు.