భట్టి విక్రమార్క పాదయాత్రకు బ్రేక్
1 min readసిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు బ్రేక్ పడింది. తీవ్ర ఎండలో నడుస్తున్న కారణంగా ఆయన వడదెబ్బకు గురయ్యారు. శరీరంగంలో ఘగర్ లెవల్స్ తగ్గడంతో భట్టి విక్రమార్క నిరసంగా ఉన్నారు. ప్లూయిడ్స్ బాగా తగ్గడం వల్ల పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. దీంతో 48 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలని భట్టి విక్రమార్క నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం జడ్చర్లలో ఆయన పాదయాత్ర నిర్వహిస్తున్నారు.