కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు ఇంఛార్జ్ సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ వ్యవహారాలపైన వీరి మధ్య చర్చ జరిగింది. నామినేటేడ్ పోస్టుల భర్తీ, సర్ ప్రక్రియ పైన సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలువనున్నారు.
