హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి రంగనాథ్ ను తొలగించాలి.. హైకోర్టు ఆదేశాలు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఆయన పైన 63 కు పైగా కోర్టు దిక్కరణ పిటిషన్లు వచ్చాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.ఎంతటి ప్రజాదరణ ఉన్నా, ఆవేశం ఉన్నా.. చట్టం, రాజ్యాంగ నియమాలను దాటి వ్యవహరిస్తే సహించేది లేదని కోర్టు స్పష్టం చేసింది.లోతుకుంట భూవివాదంలో కోర్టు స్టే ఉత్తర్వులను ఉల్లంఘించి కూల్చివేతలకు పాల్పడ్డారన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ కీలక ఆదేశాలు వచ్చాయి.
హైడ్రా సారథ్యం నుంచి ఏవీ రంగనాథ్‌ను వెంటనే తప్పించి, ఆయన స్థానంలో ఐజీ (IG) స్థాయి కలిగిన మరొక ఐపీఎస్ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.వ్యవస్థలు చట్టానికి లోబడి నడవాలి తప్ప చట్టానికి అతీతంగా కాదు, కేవలం ఒక జీవో ఆధారంగా వచ్చిన ఏజెన్సీ కోర్టుల స్టేలను పక్కనపెట్టడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం” అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
