వివాదంలో బండి సంజయ్ కుమారుడు

1 min read

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ వివాదంలో ఇరుక్కున్నారు. తన జూనియర్ విద్యార్థిపైన ఆయన దాడి చేసిన వీడియో ఒకటి లీక్ అయింది. మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్న భగీరథ్  మరో స్టూడెంట్ ని దూషిస్తు పలు మార్లు చేయిచేసుకున్నాడు. భగీరథ్ తో పాటు మరో విద్యార్థి కూడా దాడిలో పాల్గొన్నట్లు వీడియోలో ఉంది. దీనిపైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బండి సంజయ్ కుమారుడి వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. అయితే భగీరథ్ స్నేహితుడి సోదరికి అసభ్యకరమైన సందేశాలు పంపించడం వల్లనే తనని కొట్టినట్లు ఓ విద్యార్థి వీడియోను విడుదల చేశాడు.  తనతో తనకెలాంటి శత్రుత్వం లేదని, అంతా కలిసి పోయామని వీడియోలో చెప్పుకొచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn