టీఆర్ఎస్ కవిత ది కాదు.. మాదే

కవిత పార్టీ టీఆర్ఎస్ పైన వివాదం మొదలైంది. అసలైన టీఆర్ఎస్ పార్టీ మాదేనని మహారాష్ట్ర లోని సోలాపూర్ నాయకులు ఎన్నికల కమిషన్ ఆశ్రయించారు. తెలంగాణ రాష్ట్ర సామాజిక సేవ పేరుతో ఇప్పటికే తాము దరఖాస్తు చేశామని వారంటున్నారు.కవిత పార్టీ ప్రకటనకు ఒక రోజు ముందే సీఈసీకి సోలాపూర్ నేత దయానంద్ మహాదేవ్ టీఆర్ఎస్ పేరుతో దరఖాస్తు చేసుకున్నాడు. కవిత టీఆర్ఎస్ పార్టీ పైన అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఎన్నికల సంఘం కోరింది. దీంతో దాదాపు 700 అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. మరో వైపు టీఆర్ఎస్ పేరును ఎవరికి కేటాయించవద్దని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరినట్లు సమాచారం.
