అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు .. పోలీసులకు కొత్త బాస్ వార్నింగ్

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చివరిదశకు చేరుకుందన్న ఆయన త్వరలో తుది చార్జ్ షీట్ ఫైల్ చేస్తామని స్పష్టం చేశారు.తెలంగాణ డీజీపీ గా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. కుటుంబసభ్యులు, సీనీయర్ ఐపీఎస్ అధికారుల మధ్య ఆయన పదవీ బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఈ సందర్భంగా సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వస్తామని డీజీపీ వివరించారు. మనీలాండరింగ్, రియల్ ఎస్టేట్ మరణాలు, సైబర్ నేరాల పైన ప్రత్యేక దృష్టి పెడతామని సీవీ ఆనంద్ తేల్చి చెప్పారు.
