చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల భేటీ
1 min read
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో మంచు మనోజ్ దంపతులు సమావేశమయ్యారు. తన భార్య భూమా మౌనికా రెడ్డి, కుమారుడితో కలిసి మనోజ్ మాజీ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఎపి సిఎం వైఎస్ జగన్ కు మోహన్ బాబు కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో మనోజ్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. మనోజ్ సతీమణి భూమా మౌనిక టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సోదరి. ఆళ్లగడ్డ అసెంబ్లీ ఇంఛార్జ్ గా ఆమె వ్యవహారిస్తున్నారు. మంచు మనోజ్ దంపతులు తెలుగుదేశంలో చేరనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. భూమా మౌనిక ఆళ్లగడ్డ లేదా నంధ్యాల టిక్కెట్ ఆశిస్తున్నట్లు చెపుతున్నారు.