కేసీఆర్ కు హరీష్ రావు వెన్నుపోటు.. కవిత ఫైర్

కేసీఆర్‌కు కచ్చితంగా హరీశ్‌రావు వెన్నుపోటు పొడుస్తాడని టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కేసీఆర్‌కు ఆరోగ్యం బాగుండొద్దని హరీశ్‌రావు క్షుద్రపూజలు చేయిస్తున్నారని ఆమె నిప్పులు చెరిగారు.రాజ్‌పుష్ప స్కైలాబ్ విల్లాలో ఆర్ఎస్ఎస్ కీలక నేతతో హరీశ్‌రావు భేటీ అయ్యారని కవిత అన్నారు. హరీశ్‌రావు పాల కంపెనీ నుంచి ప్రముఖ ఆస్పత్రులకు పాల సరఫరా జరుగుతోందని ఆమె ఆరోపించారు. హరీశ్‌రావు ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఆయన భార్య పేరిట ఉన్న మిల్చీ మిల్క్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.960 కోట్ల విలువైన పాలు సరఫరా చేశారని ఆమె ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ పార్టీ అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, ప్రజా సమస్యలను కూడా పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. రాఖీ కట్టడానికి గత ఏడాది కేటీఆర్‌ను సమయం అడిగితే ఇవ్వలేదని, ఈసారి దేశంలో కూడా లేకుండా పోయాడని కవిత వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవాన్ని చంపుకొని ఎన్నిసార్లు అడగాలని ఆమె ప్రశ్నించారు.
