మీరాలం చెరువును ఆకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

మీరాలం చెరువు పైన నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఉదయం ఏడున్నర గంటలకే వెళ్లిన సీఎం చెరువు వద్ద దాదాపు గంటన్నర పాటు ఉన్నారు. భారీ క్రేన్ ఎక్కి చెరువు పరిసరాలను పరిశీలించారు. పనులపై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు.గడువులోగా సస్పెన్షన్ బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. చెరువులోకి మురుగునీరు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. చెరువు నుంచి మూసీలోకి వరద నీరు వెళ్లేలా నాలాలను విస్తరించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు.మీరాలం చెరువులో ఉన్న ఐలాండ్స్‌ను తీర్చిదిద్దాలన్నారు. వాటర్ స్పోర్ట్స్‌ను డిజైన్ చేసి పర్యాటకులను ఆకట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

