వధువుకు తాళి కట్టిన కల్వకుంట్ల కవిత

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత బుధవారం కీసర x రోడ్డు లోని ఆరాద్య కన్వేన్షన్ లో యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ – శివాని వివాహ మహోత్సవానికి ఆడబిడ్డ గా వ్యవహరించారు. ఈ సందర్బంగా నూతన వధువరుల కుటుంబ సభ్యులు కవితకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.బాలప్రసాద్ ముదిరాజ్ కులాచారం ప్రకారం వరుడు వధువుకు తాళి కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ము ను తాళిగా భావిస్తూ మూడు ముళ్ళు వేయిస్తారు. ప్రసాద్ కు తోబుట్టువులు లేరు. ప్రసాద్ కోరిక మేరకు కవిత ఆడపడచుగాప్రధాన గౌరీ పూజలో పాల్గొన్నారు. అనంతరం మేళతాలాల మధ్య కవిత వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడుముళ్ళు వేశారు.ఉంగరపు వేలుకు ప్రధాన ఉంగరం తొడిగారు. వడిబియ్యం పోసి పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు. నూతన వస్త్రాలను వధూవరులకు అందజేసి సుముహూర్తాన నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.అనంతరం బాలప్రసాద్ శివాని మెడలో మంగళసూత్రధారణ చేశారు.
