ఈవీఎంలు మార్చేశారు
1 min read
మరో రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్న సమయంలో సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం అధికారులు, బీజేపీ నేతలు కుమ్మక్కయి ఈవీఎంలను తారుమారు చేశారని ఆరోపించారు. బీజేపీ ఓడిపోతుందని భావిస్తున్న చోట్ల ఈవీఎంలను మార్చారని అఖిలేష్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ లో మళ్లీ బీజేపీనే విజయం సాధిస్తుందని అన్ని ఎగ్జిట్ ఫోల్స్ స్పష్టం చేసిన నేపథ్యంలో యాదవ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అఖిలేష్ ముందుగానే ఓటమిని ఒప్పుకున్నారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.