ఆర్టీసీ బస్సులో మాజీ మంత్రి
1 min read
ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర మంత్రిగా నాలుగు సార్లు ఉన్నారు. ప్రస్తుతం ఎపీ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా వ్యవహారిస్తున్నారు. అయితే హుంగు ఆర్భాటాలకు దూరంగా అనంతపురం జిల్లాలో తన స్వగ్రామంలో నివాసముంటున్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటు కాలం గడుపుతున్నారు. ఆయనే డాక్టర్ ఎన్. రఘవీరారెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా రఘవీరారెడ్డి అంత క్రియాశీలకంగా లేదు. స్వగ్రామం నీలకంఠాపురంలో వ్యవసాయం చేస్తు నిరాడంబరంగా జీవితాన్ని గడుపుతున్నారు. తాజా గా ఆయన ఆర్టీసీ బస్సులో బెంగళూరు వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో రఘవీరారెడ్డి మంత్రిగా అత్యంత కీలక పాత్ర పోషించారు.