ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

పార్లమెంటులో మహిళ రిజర్వేషన్ , నియోజకవర్గాల పునర్విభజన బిల్లు తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారని సమాచారం. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కూడా ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. నియోజకవర్గాల పునర్విభజన పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం వైఖరీ ని తప్పుపడుతున్నారు. యాభై శాతం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఆయన హైబ్రీడ్ ప్రతిపాదన తీసుకువచ్చారు. దీనిపైన ఆయన ఢిల్లీలో విసృతంగా చర్య తీసుకువచ్చే అవకాశం ఉంది.
