ఎకరానికి 12 వేలు…
1 min read
రైతు భరోసా కింద యేడాది కి ఎకరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పంటకు ఆరు వేల చొప్పున రైతులకు అందజేయనున్నారు. వ్యవసాయ కూలీలకు యేడాది కి 12 వేలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఎలాంటి షరతులు లేకుండా ప్రతీ ఎకరానికి రైతు భరోసా అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం అనంతరం ఆయన స్పష్టం చేశారు. “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లో భాగంగా రైతు కూలీలకు 12 వేలు అందజేస్తారు. రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. జనవరి 26, 2025 నుంచి ఈ పథకాలు ప్రారంభమవుతాయని తెలిపారు. వ్యవసాయ యోగ్యం కాని భూములకు (మైనింగ్, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, నివాస, పారిశ్రామిక, వాణిజ్యఅవసరాలకు ఉపయోగించే భూములు, నాలా కన్వర్టెడ్ భూములు, వివిధ ప్రాజెక్టులకు ప్రభుత్వం సేకరించిన భూములకు) రైతు భరోసా వర్తించదని ముఖ్యమంత్రి వివరించారు.