కాంగ్రెస్ పైన కేసీఆర్ నిప్పులు

1 min read

ధరణిని రద్దు చేయాలంటున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలని సిఎం కేసీఆర్ కోరారు. అనేక దశాబ్దాలుగా రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేలా ధరణిని తీసుకువచ్చామని ఆయన అన్నారు. నాగర్ కర్నూల్ కొత్త కలెక్టరేట్ ను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సిఎం కేసీఆర్ మాట్లాడారు. బీజేపీ ఊసేత్తకుండా కాంగ్రెస్ పైన విమర్శలు గుప్పించారు. అనేక సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏమీ చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణను ఆగం చేసిన వాళ్లు మళ్లీ ఇప్పుడు అధికారం కావాలని అడుగుతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ చేతిలో పెట్టొద్దని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn