బ్రహ్మం చౌదరి ఇంటికి సీఎం చంద్రబాబు

ఇటీవల అస్వస్థతకు గురైన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరామర్శించారు. తాడేపల్లిలోని బ్రహ్మం చౌదరి నివాసానికి వెళ్లిన ఆయన బ్రహ్మం చౌదరి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు.
